Chandrababu Naidu on Hyderabad GES And Metro Rail | Oneindia Telugu HD
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Wednesday responded on Global Entrepreneurship Summit and Hyderabad Metro rail హైదరాబాదులోని హెచ్ఐసీసీలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్, అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. ఆయన ఏపీ అసెంబ్లీలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని కోసం నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతోంది. ఈ రెండు కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు. హైదరాబాదుకు మెట్రో రైలు తన వల్లే వచ్చిందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర ఏమాత్రం పోయేది కాదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మెట్రో కోసం పోరాడానని తెలిపారు. బెంగళూరు, అహ్మదాబాదుల జాబితాలో హైదరాబాదు కూడా ఉండాలని చెప్పానని చంద్రబాబు తెలిపారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే హైదరాబాద్ మెట్రో ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే అది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండెనని ఆయన అభిప్రాయపడ్డారు. Oneindia Telugu Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/sp2m54 ♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/ ♥ YouTube : https://goo.gl/sp2m54 ♥ Website : http://telugu.oneindia.com ♥ twitter: https://twitter.com/thatsTelugu ♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu ♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬